మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
ప్రసిద్ధ చెక్ ఆటోమేకర్ స్కోడా.. భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ త్వరలో దాని SUV లైనప్‌లోకి కొత్త చేరిక అయిన స్కోడా కోడియాక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏడు సీట్ల పూర్తి పరిమాణ SUVని త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
భారతీయ SUV మార్కెట్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
Maruti e Vitara : దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో Xoom 125 స్కూటర్‌ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆటో ఎక్స్‌పో 2025లో తన 7 కార్ల ప్రత్యేక ఎడిషన్‌లను ప్రదర్శించింది. ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఈ కార్లలో కొన్ని మార్పులు చేసింది. వీటిలో మారుతి సుజుకి డిజైర్ యొక్క అర్బన్ లక్స్ ఎడిషన్ కూడా ఉంది. డిజైర్ యొక్క కొత్త వేరియంట్‌లో ఫ్రంట్ గ్రిల్, డోర్ ప్యానెల్, వెనుక బంపర్ చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ అమర్చారు. ప్రస్తుత డిజైర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరను ఒకసారి చూద్దాం.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలను తమ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా మోడల్ ను తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారుతో ఎకో ఫ్రెండ్లీ జర్నీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు 1.0 టర్బో…
Jupiter CNG Scooter: టీవీఎస్ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త సీఎన్‌జీ స్కూటర్ గా టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రస్తుతం కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే ప్రదర్శించబడింది. అయినప్పటికీ, ఈ స్కూటర్ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన నూతన ఆవిష్కరణగా నిలుస్తోంది. ఈ స్కూటర్ విడుదల తేదీపై ఇంకా కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీనికోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. గతంలో బజాజ్ సంస్థ విడుదల చేసిన ఫ్రీడమ్ సీఎన్‌జీ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో…
హ్యుందాయ్ మోటార్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన SUV క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. జనవరిలో జరిగే 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో' (ఆటో ఎక్స్‌పో 2025)లో దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.