Maruti e Vitara : దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. మారుతి సుజుకి ఈ-విటారా చూసిన తర్వాత ఆ కంపెనీపై ప్రజల అంచనాలు అమాంతం పెరిగాయి. దీని ప్రారంభం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే దాన్ని ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది. ఈ కారు బుకింగ్ అనధికారికంగా ప్రారంభమైంది. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారును త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది కంపెనీ. అయితే, కారు ధరను కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించాలేదు. ధర తెలియకపోయినా దీన్ని బుక్ చేసుకునే అవకాశం ఉంది.
E-Vitara మూడు వేరియంట్లు
గ్రాండ్ విటారా లాగానే, E విటారా కూడా మూడు వేరియంట్లలో మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఇందులో డెల్టా, జీటా, ఆల్ఫా మోడల్‌లు ఉన్నాయి. కంపెనీ దాని బేస్ వేరియంట్‌లో 49-kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించగలదు. టాప్ వేరియంట్ 61-kWh బ్యాటరీ ప్యాక్ పొందవచ్చు. దీని పరిధి 500 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీ ప్యాక్ బెస్ట్ పర్ఫామెన్స్ కోసం మాత్రమే కాదు సేఫ్టీ కోసం కూడా రూపొందించబడింది.
Read Also:Kerala: ఎంత కష్టం అనుభవించావు తల్లీ.. మృగంలా ప్రవర్తించిన భర్త.. సంచలనంగా విష్ణుజ మృతి..
E Vitara బ్యాటరీ ప్యాక్ 120 లిథియం-అయాన్ బేస్ డ్ సెల్స్ ను కలిగి ఉంటుంది. అవి -30°C నుండి 60°C వరకు ఉష్ణోగ్రతలలో కూడా పనిచేస్తాయని టెస్టింగులో తేలింది. ఇది అధునాతన ఉష్ణ నిర్వహణ వ్యవస్థ(Thermal management system)తో అమర్చబడి ఉంది. ఇది మాత్రమే కాదు.. ఇందులో లో-అయాన్ కూలెంట్ ఉంటుంది. కంపెనీ దీనిని అనేక విభిన్న పరిస్థితులలో టెస్టింగ్ చేసింది. మారుతి ఇ వితారాలో మూడు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
ఇ-విటారా ఇంటర్నల్, ఎక్స్ టర్నల్
ఈ మారుతి కారులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతున్నారు. 10.25 అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అందించబడింది. ఈ కారు ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. అవి చాలా సౌకర్యంగా ఉంటాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ కూడా అందించబడ్డాయి. ఈ కారులో అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉన్నాయి.