Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్‌లో ప్రయాణికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uber Cab:క్యాబ్ కంపెనీ ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ యువకుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇంత భారీ బిల్లు చూసి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న యువకుడి స్పృహ తప్పింది. వెంటనే కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. ఉబర్, ఓలా, ర్యాపిడో అంటూ క్యాబ్, బైక్ సర్వీసులు వచ్చాయి. వెంటనే ఎక్కిడికైనా వెళ్లాలంటే చాలు ఆన్ లైన్లో వాటిని బుక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నం. మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత క్యాబ్ ల చార్జీలు పెంచేస్తూ వచ్చారు. ఇక డిమాండ్ ఎక్కువున్న సమయంలో సర్జ్ చార్జీల పేరుతో రెండు మూడింతలు ఎక్కువగా వసూలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది దూరానికే వందల్లో, వేలల్లో చార్జీలు పడుతున్న ఘటనలూ తెలుసు.
Read Also: Gujarat: గుజరాత్లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
తాజా ఘటన బ్రిటన్‌కు చెందినది, ఇక్కడ 22 ఏళ్ల ఆలివర్ కల్పన్ తన ఆఫీసు నుంచి ఉబెర్ క్యాబ్ బుక్ చేశాడు. ఆఫీసుకు 6 కి.మీ దూరంలో ఉన్న పబ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ స్నేహితులతో కలిసి డ్రంక్ పార్టీకి వెళ్లాడు. అంతా బాగానే జరిగింది. ఆలివర్ క్యాబ్ ఎక్కి తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ పార్టీ చేసుకొని రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఆలివర్ కల్పన్ తన ఉబర్ ఖాతాను క్రెడిట్ కార్డుకు ముందే అనుసంధానం చేసి పెట్టుకోవడంతో బిల్లు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దానితో క్యాబ్ దిగి వెళ్లిపోయాడు. తాగిన కారణంగా, ఆలివర్ తన బిల్లును తనిఖీ చేయలేకపోయాడు. పొద్దున్నే లేచిన తర్వాత ఫోనులో క్రెడిట్ కార్డ్ బిల్లు చెక్ చేసుకున్నాడు. దీంతో రాత్రి చేసుకున్న పార్టీలో తాగినదంతా దిగింది మనోడికి. ఎందుకంటే అతడికి ఉబర్ ఏకంగా 39,317 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు) బిల్లు వచ్చింది.
బిల్లును చూసి కల్పన్ వెంటనే ఉబర్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. అంత బిల్లు వచ్చింది నిజమేనని.. అయితే క్రెడిట్ కార్డులు అంత బ్యాలెన్స్ లేనందువల్ల పేమెంట్ రిజెక్ట్ అయిందని కస్టమర్ కేర్ సిబ్బంది చెప్పారు. ఆ బిల్లు కట్టాలని కోరారు. అయితే తాను వెళ్లిన దూరానికి అంత బిల్లు ఎలా వచ్చిందంటూ కల్పన్ ఫిర్యాదు చేశాడు. కల్పన్ ఫిర్యాదుతో పరిశీలించిన ఉబర్ ఇంజనీర్లు.. తాను ప్రయాణించిన చోటు (డ్రాపింగ్) లొకేషన్ మారిపోయిందని గుర్తించారు. కల్పన్ క్యాబ్ డ్రాపింగ్ లొకేషన్ మాంచెస్టర్ లోని విచ్ వుడ్ ప్రాంతంకాగా.. ఉబర్ యాప్ లో లొకేషన్ ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో ఉన్న విచ్ వుడ్ పార్క్ గా చూపించింది. అంటే కల్పన్ క్యాబ్ లో ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ నుంచి ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు ప్రయాణించినట్టు చూపి.. రూ.32 లక్షలకుపైగా బిల్లు వేశారన్న మాట.‘‘ఇంకా నయం. నా కార్డులో అంత డబ్బు లేదు కాబట్టి బతికిపోయా. లేకుంటే వాళ్లు బిల్లు కట్ చేసుకుని ఉంటే.. రీఫండ్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది” అని ఓలివర్ కల్పన్ పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?