ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన టీమిండియా ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తో వెనకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే గురువారం అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశముంది. రెండో వన్డే మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలింగ్‌లో మార్పులు…
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ఆసీస్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోగా.. భారత్ స్కోరు 11.5 ఓవర్లకు 37/3గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ (6), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. అయితే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్…
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి 223 రోజులైంది. ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత రో-కోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం పెర్త్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చివరగా మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన టీమిండియా.. ఏడు నెలల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు తొలి పరీక్ష ఎదురుకానుంది. ఇక కళ్లన్నీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కంగారూ గడ్డపై ఈ…
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19న మొదలయ్యే వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ సారథిగా ఎంపికయ్యాడు. రెండు సిరీస్‌లలో చాలా తక్కువ మందికి చోటు దక్కగా.. అందులో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఇటీవలి సిరీస్‌లలో జట్టులో ఉంటున్నా.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో…
స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 3-1తో భారత జట్టును ఓడించింది. దీంతో కంగారూ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ.. ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి భారత క్రికెట్ జట్టు- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేటప్పుడే కాస్త ఇబ్బందిగా అనిపించింది.. వెన్ను నొప్పిపై వైద్య బృందంతో చర్చించాను అని టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ బుమ్రా తెలిపాడు. జట్టులోని సహచరులు బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావడంతో.. ఒక బౌలర్ తక్కువైనప్పటికీ ఆసీస్‌ను కట్టడి చేయగలిగాం అన్నారు.
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు.