Sydney Test: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.
AUS vs IND: సిడ్నీ టెస్టులో విజయం కోసం భారత్ పోరాటం చేస్తోంది. ఆస్ట్రేలియా ఎదుట టీమిండియా 162 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దీంతో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది.
మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.
సిడ్నీ వేదికగా రేపటి (జనవరి 2) నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు.
డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష మందికి పైగా ఉండగా.. మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడే మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఆడలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. సెకండ్ టెస్టుకు ఆడబోతుండటంతో.. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా దిగుతాడు అనుకున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారు. గాయపడిన గిల్ స్థానంలో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం…