తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. సరిహద్దుల్లోనే వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు మోహరించాయి.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్ పై బీఆర్ఎస్ సర్పంచ్ అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. నరసింహుల పేట మండలం గోపాతండా వద్ద ఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేసినట్లు భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ఏరియాలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మద్దతుదారులు తనను విచక్షణా రహితంగా కొట్టారని అతడు పేర్కొన్నాడు. తనపై దాడి చేస్తున్న.. సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పుకొచ్చాడు.
తాజాగా తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని ఓ తాగుబోతు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని పొట్టుపొట్టుకొట్టాడు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లినే నడి రోడ్డుపై జుట్టు పట్టి లాగి ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఇవాళ (బుధవారం) జరిగింది. అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మమ్మ భర్త కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.
ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో బుల్ షార్క్ ఒక మత్స్యకారుడి చేతిని కొరికి, అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది.
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయాలు వేడెక్కాయి. జెడ్పి ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల దాడి హాట్ టాపిక్ మారింది. అయితే.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పై ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడైన…
జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌కు షాక్ తగిలింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయనపై కొందరు వ్యతిరేకులు దాడి చేశారు. అంతేకాకుండా నల్ల సిరా కూడా చల్లారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి కుర్చీలు విసిరి కొందరు దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా రాకేష్ టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానికి వైరం నడుస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల ఈ…