Dogs attack: బాలికపై కుక్కలు మూకుమ్మడి దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ సింహాలు మరోసారి బీభీత్సం సృష్టించాయి. ఓ బాలికపై కుక్కల గుంపు అమాంతంగా దాడికి తెగబడ్డాయి. డాగ్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. తలో వైపు నుంచి దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.
అమ్రోహా జిల్లాలో ఐదేళ్ల బాలిక శనివారం ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడే ఉన్న వీధికుక్కల గుంపు దాడికి తెగబడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి శతవిధాలా ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. వాటితో ఆమె పోరాడుతూనే ఉంది. పరిగెత్తేందుకు ప్రయత్నించగా మరోసారి దాడి చేశాయి. కొన్ని కుక్కలు శరీరాన్ని పీక్కుతింటుంటే.. మరికొన్ని కుక్కలు జుట్టు పట్టుకుని లాగే ప్రయత్నం చేశాయి. ఒకేసారి ఐదు కుక్కలు దాడి చేయడంతో ఆ బాలిక విలవిలలాడిపోయింది. ఇంతలో అటు వైపు వస్తున్న స్థానికుడు కుక్కలను బెదిరించడంతో విడిచిపెట్టి వెళ్లిపోయాయి. గాయాల పాలైన చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Also Read
వీధికుక్కలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందజేయాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్, ముజఫర్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.
ఇదిలా ఉంటే వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళలు చేశారు. మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
తాజాగా యూపీలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీధి కుక్కలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తు్న్నారు. చిన్నారుల ప్రాణాలు బలి కాకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
LOCATION :Amroha
अमरोहा- आवारा कुत्तों के झुंड ने मासूम बच्ची पर किया हमला, कुत्तों के झुंड ने बच्ची को सड़क पर घसीटा, मासूम बच्ची की हालत नाजुक, अस्पताल में भर्ती, स्थानीय लोगों ने मासूम को आवारा कुत्तों से बचाया, कुत्तों के हमले की घटना सीसीटीवी कैमरे में कैद, पूर्व में भी… pic.twitter.com/UInWZNAJqq
— MANOJ SHARMA/ मनोज शर्मा (@manojpehul) March 9, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!