Atrocious News: బిడ్డ తెల్లగా ఉన్నాడని.. కన్న కొడుకునే గోడకేసి కొట్టిచంపిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious News: అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే… ఆ బాలుడి ఉసురు తీసింది. ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే కిరాతకంగా గోడకేసి కొట్టి చంపిన దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి.. అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కనీసం జాలి చూపకుండా ముక్కుపచ్చలారని పసికందుపై ప్రతాపం చూపించాడు. ఇందుకు కారణం తెలిసి.. సభ్య సమాజం తలదించుకుంటోంది.
అసలు ఏం జరిగిందంటే.. చెన్నైకి చెంది రంజిత్ కుమార్, కౌసల్య అనే యువతిని ఐదు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే సహజీవనం చేయడం వల్ల గర్భం దాల్చిన రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది కౌసల్య. ఆ పుట్టిన బిడ్డను ఎప్పుడూ తీక్షణంగా చూసేవాడు. ఆ బాలుడిని చూసినప్పుడల్లా అతనికి అనుమానం ఎక్కువ అయింది. కొడుకు తెల్లగా ఉన్నాడని భార్యపై అనుమానం పెంచుకున్నాడు రంజిత్ కుమార్. తాను, తన భార్య నల్లగా ఉండగా.. తమ బిడ్డ మాత్రం తెల్లగా ఎలా జన్మించాడంటూ అనుమానాన్ని పెంచుకుని.. శుక్రవారం భార్యతో రంజిత్ గొడవపడ్డాడు. తీవ్ర ఆవేశానికి గురై మృగంలా మారి రెండు నెలల పసికందును పలుమార్లు గోడకేసి కొట్టి చంపేశాడు.
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
Read Also: Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు
అక్కడక్కడే ఆ రెండు నెలల బాలుడు తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. రంజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సహజీవనం చేద్దామన్న రంజిత్.. ఉన్నతంగా ఆలోచిస్తాడని అనుకుంటే ఇలా చేశాడని అతని భార్య కన్నీటి పర్యంతం అయింది. “అనుమానంతో నన్ను, నా కుమారుడిని నా భర్త తరుచుగా కొడుతూ ఉండేవాడు. ఆ అనుమానంతోనే నా కుమారుడిని హత్య చేశాడు. నా భర్త, నేను చూసేందుకు నల్లగా ఉంటాం. నా కుమారుడు తెల్లగా ఉంటాడు. అలా ఎందుకు పుట్టాడు అని తరచుగా నన్ను హింసించేవాడు. చివరికి నా కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు” అంటూ.. అతని భార్య కన్నీటిపర్యంతమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
ట్రెండింగ్
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!