ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 6న నామినేషన్లకు చివరి గడువు, జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఉప ఎన్నిక కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరేంధిర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. దివంగత మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణానికి గురైన సంగతి…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.…
తెలంగాణలోని ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి నకిలీ పులి చర్మాన్ని 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని అమ్మే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. టైగర్ స్కిన్ కి ఉన్న డిమాండ్ తో మేక తోలును పులి తోలుగా రంగులు వేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్…