యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. ఈ తరహాలోనే తుర్కపల్లి, ఆత్మకూరు, మోట్ కొండూరు, భువనగిరి మండలంలో కూడా దొంగతనాలు జరిగాయి. పోలీసుల కళ్లు కప్పి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు కేటుగాల్లు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దొంగల ముఠాపై పోలీసుశాఖ గట్టి నిఘా పెట్టారు.
అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి లో కూడా దుండుగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి ఇంటి ముందు కూర్చున్న సుజాత అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారం తాడును ద్విచక్ర వాహనంపై వచ్చిన వారు దొంగిలించారు దుండగులు. బాధితురాలు సుజాత నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు రాత్రి పూట బయట కూర్చొన్న, పడుకున్న అప్రమత్తంగా వుండాలని సూచించారు.
Asani Cyclone: అలర్ట్.. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు