నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. పేదలకు మంత్రి శుభవార్త పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పారు.
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో పలువురు మంత్రులు పాలు పంచుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. "చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ వైసీపీకి చెందిన నేత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో మంత్రి ఇక్కడ నుంచి ఉన్నా అభివృద్ధి లేదు. యువ గళం పాదయాత్ర సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు…