CM Atishi: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్రౌడ్ ఫండింగ్ అవసరమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.40 లక్షలు అవసరమని.. అందుకోసం, రూ.100 నుండి రూ. 1000 వరకు ప్రజలు సహాయం చేయాలనీ కోరారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇది మాకు సహాయపడుతుందని తెలిపారు. నా క్రౌడ్ ఫండింగ్ ప్రచారానికి మద్దతు ఇవ్వండని, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు తీసుకోబోమని అతిషి…
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు.
కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఇటీవలే కైలాష్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అతిషి భేటీని ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు.
దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా.. అతిషిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు, తదితరులు హాజరయ్యారు.
కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్‌జీ పేర్కొన్నారు.
Delhi : ఢిల్లీలో అతిషీ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సెప్టెంబరు 21న అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.