Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21వ తేదీన అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ సక్సేనాతో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పేరును సమర్పించనున్నారు. దీనికి ముందు, ఉదయం 11:30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎం పేరు చర్చించి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో లేడీ సూపర్ స్టార్..…
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సెనాకు లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వేడుకల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అతిషికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఆమ్ ఆద్మీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
Delhi Water Crisis : ఢిల్లీలో నీటి కొరతపై నీటి శాఖ మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె నిరాహార దీక్ష చేపట్టి నేటికి మూడో రోజు. అతిషి మూడో రోజు వీడియో సందేశాన్ని విడుదల చేసింది.