Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైనప్పటి నుంచి ఆప్ నేతలు బీజేపీ టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మంత్రి అతిషీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని ఆ పార్టీ తనను సంప్రదించినట్లుగా విలేకరుల సమావేశంలో చెప్పారు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్‌ఆద్మీ పార్టీ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. దీనిపై మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు.
AAP: ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డాను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Delhi Budget 2024: ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం (మార్చి 4) కేజ్రీవాల్ ప్రభుత్వ 10వ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో విద్యకు రూ.16,396 కోట్లు కేటాయించారు.
Delhi School Holidays: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం చలిగాలులు, పొగమంచు దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించబడ్డాయి. జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Delhi Air Pollution News : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పదవి రేసులో లేరని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం అన్నారు. కేజ్రీవాల్ దేశానికి ఆదర్శప్రాయమైన ప్రధాని కాగలరని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి స్పందిస్తూ .. ఇది ప్రధాన ప్రతినిధి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని.. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. ఢిల్లీ మంత్రులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.