యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా మారారు. ఆయన హీరోగా నటించిన ‘శేఖర్’ చిత్రాన్ని జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో మూవీ ట్రైలర్ ను గురువారం ఏఎంబీలో విడుదల చేశారు.…