జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ నోటి వెంట అమ్మడం అనే పేరు తప్ప ఇంకో మాట రావడం లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు భారం మోపుతున్నారు. సీఎం జగన్ తన పుట్టిన రోజు OTS అనే ఒక దుర్మార్గమైన కార్యక్రమం మొదలు పెట్టారు.
అసలు OTSపై సీఎం జగనుకేం హక్కు ఉంది. 5 ఏళ్లలో 32 లక్షల ఇళ్ళు కడతాం అని చెప్పిన జగన్.. 30 నెలల్లో జగన్ ఒక్క ఇల్లు ఐన కట్టారా..? 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 7.52 లక్షల ఇళ్ళు కట్టింది వాస్తవం కాదా..? జగన్ ఇచ్చే ఇంటి పట్టా చెల్లుబాటు కాదు. 5 వేల కోట్ల దోపిడీ కోసమే OTS కార్యక్రమం చేపట్టారని విమర్శించారు అచ్చెన్నాయుడు.
పేదల ఇళ్లకు 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుందన్నారు. కానీ ఇప్పటికి కేవలం 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఉపయోగించారన్నారు. ఎప్పుడు 32 లక్షల ఇళ్లు కడతారు..? ఎలా కడతారు..?చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.చివరికి పుట్టిన రోజున కూడా జగన్ నిజం మాట్లాడలేదు.
పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా ఓటీఎస్ చేయాలి.టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిస్తాం.ఓటీఎస్ కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు.. ఇది దారుణం.నీ పాలన బాలేదని సొంత పార్టీ వాళ్ళు చెప్పినా దాడులు చేస్తున్నారు. దాడి చేసిన గుప్తాను పిచ్చివాడు అన్నారు.. ఇప్పుడు మంత్రి పిలిచి కేక్ పెట్టారు. వైసీపీ పాలన దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని జనం ఎదురు చూస్తున్నారు.