భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కాదేదీ మోసానికి అనర్హం. బ్యాంకుల పేరు చెప్పి.. ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నెంబర్లతో ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టేవారు మరికొందరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది. కొంత మంది తెలివిగల వారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది. వస్తువు కొన్న తరువాత మీ అక్కౌంటులోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి. కానీ డబ్బులు మాత్రం రావు..ఇది నకిలీ…
ప్రస్తుతం నిమ్మకాయ రేటు ఆకాశాన్ని అంటుతోంది. కేజీ నిమ్మకాయల ధర రూ.200పైగా పలుకుతోంది. దీంతో పలువురు వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్‌లో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయనే అంటారనే కామెడీ డైలాగ్ తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తోంది. అదేంటి నిమ్మకాయను ఉల్లిపాయ అనడమేంటని అనుకుంటున్నారా? దీని కథేంటో పూర్తిగా తెలుసుకుందాం…