వాయిదా పద్దతిలో దేనినైనా అనుభవించవచ్చు… ఎంతటి విలసవంతమైన జీవితన్నైనా అనుభవించేయచ్చు అనేలా ప్రచారాలు కొంతమంది యువతకు మరణ శాపాలు గా మారుతున్నాయి…ఈ నేపథ్యంలో నే తాహతుకు మించి అప్పులు చేస్తోంది నేటి యువత. ఇచ్చిన లోన్లకు నాలుగైదు రెట్లు వసూలు చేస్తూ రికవరీ పేరుతో ఒత్తిడి చేసి ఇంటిపై దౌర్జన్యం చేసి మానసిక ప్రశాంతత లేకుండా పరువు తీస్తున్నారు. దీంతో లోన్ రికవరీ ఏజెంట్లు పుణ్యమంటూ ఓ యువకుడు నిండు ప్రాణం తీసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన మక్కెళ్ల నాగరాజు (30) అశ్వారావుపేట పట్టణంలో ఓ సెల్ ఫోన్ దుకాణంలో గత మూడు నెలల క్రితం వాయిదా పద్దతిలో రెండు సెల్ ఫోన్ లను బజాజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నాడు, అయితే నాగరాజు EMI ద్వారా తీసుకున్న రెండు సెల్ ఫోన్ లకు ప్రతి నెల EMI ఎటువంటి పెండింగ్ లేకుండా కట్టడంతో,నాగరాజు సిబిల్ లనే ట్రాక్ బజాజ్ ఫైనాన్స్ వాళ్లకు మంచిగా కనిపించడంతో వెంటనే లక్ష రూపాయలు లోన్ ఇస్తామంటూ నాగరాజు కి తరచు ఫోన్ లు చేయడం ప్రారంభించారు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వెంటనే లక్ష రూపాయలు లోన్ నాగరాజు అకౌంట్ లో క్రెడిట్ చేశారు.
నాగరాజుకు అనారోగ్యంతో ఉన్న భార్య అలానే రెండు సంవత్సరాలు ఆడపిల్ల ఉంది, నాగరాజు తల్లిదండ్రులు బెంగుళూరులో కూలీ పని నిమిత్తం వలస వెళ్లారు, ఇంటి అవసరాలకు అలానే కుటుంబ ఆర్ధిక అవసరాలకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన లోన్ నగదును నాగరాజు వాడుకున్నారు, EMI ద్వారా తీసుకున్న ఫోన్ లు విషయంలో నాగరాజు కూలి పని చేసుకుని ఎటువంటి బకాయి లు లేకుండా చెల్లించడమే నాగరాజు బలవన్మరణానికి కారణామయ్యింది. నాగరాజు ఫోన్ లు విషయంలో EMI రూపంలో బజాజ్ ఫైనాన్స్ ద్వారా రావడంతో బజాజ్ ఫైనాన్స్ ని దేవుడిలా ఫీల్ అయ్యాడు, అయితే లక్ష రూపాయలు ఎటువంటి హామీ లేకుండా రావడంతో మరోసారి బజాజ్ ఫైనాన్స్ ని అలానే ఫీల్ అయ్యాడు, కానీ బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజంట్లు EMI లు పెండింగ్ ఉండడంతో రికవరీ ఏజెంట్లు నాగరాజుని వినాయకపురం నుండి బండిపై ఎక్కించుకుని వెళ్ళే ప్రయతం చేయగా గ్రామస్థులు అడ్డుకోవడంతో నాగరాజుని లోన్ రికవరీ ఏజెంట్లు వదిలి వెళ్ళారు.

అయితే ఈ లోన్ వ్యవహారంలో లోన్ ఇప్పించిన వారు లక్ష రూపాయలకు గాను 60వేల రూపాయలను ఇచ్చి, నలభై వేల రూపాయలను ఏజెంట్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద మనుష్యుల వద్ద పంచాయతీ కూడా జరిగింది. ఆపంచాయతీలో తాను నాలుగు వేలే తీసుకున్నామని ఏజెంట్లు చెబుతున్నారు. అయితే వచ్చే సోమవారం నాడు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు లేకపోవడం అంత డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ రికవరీ ఏజెంట్లు మరోసారి నాగరాజు ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా మానసికంగా ఒత్తిడి చేశారు. గ్రామంలో నాగరాజు పరువు పోయే విధంగా వేధించడంతో మనస్తాపానికి గురై నాగరాజు గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.. గమనించిన స్థానికులు అశ్వారావుపేట హాస్పటల్ కి తరలించారు, పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ కి తీసుకెళ్లారు, చికిత్స పొందుతున్న నాగరాజు గత రాత్రి మృతి చెందాడు. తండ్రి బెంగుళూర్ లో ఉండడంతో.. కొడుకు మృతి ఘటన తెలియడంతో ఖమ్మంకు చేరుకున్నారు. లోన్ యాప్ వల్ల నే చనిపోయాడని చెబుతున్నారు.
Read Also: Congress High Command: తెలంగాణ పీసీసీ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం భేటీ.. విభేదాలపై చర్చ