శునకానికి ఉన్న విశ్వాసం మనిషి కూడా ఉండదని అంటుంటారు. కానీ అదే శునకంపై మనుషులు పెంచుకునే మమకారం అంతా ఇంతా కాదు. పుట్టినరోజు అంటే అందరికీ పండుగే. మనుషులయితే మంచిగా కేక్ కట్ చేసి గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుతారు. బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి పార్టీ ఇస్తారు. విందులో చిందులేస్తారు. అదే శునకం బర్త్ డే అయితే ఎలా చేస్తారు? శుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ పెంపుడు కుక్క బర్త్ డే ను దాని యజమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
Read Also: India vs Pakistan: గత రికార్డుల్ని తుడిచిపెట్టేసిన భారత్xపాక్ మ్యాచ్.. చరిత్రలో తొలిసారి
ONGC రిటైర్డ్ ఉద్యోగి మోటపర్తి వీరయ్య చౌదరి, రత్నకుమారి దంపతులు మిల్కీ అనే పమెరియన్ డాగ్ ను పెంచుకుంటున్నారు. ఈ పెంపుడు కుక్క అంటే వారికి ఎనలేని ప్రేమ.. మిల్కీని వారి కుటుంబ సభ్యురాలితో సమానంగా చూసుకుంటారు. పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని డిజైనర్ ద్వారా ప్రత్యేక పార్టీ వేర్ బర్త్ డే డ్రెస్ మిల్కీకి వేసి.. బంధువులను మిత్రులను పిలిచి అట్టహాసంగా కేక్ కటింగ్ నిర్వహించారు.
అనంతరం రకరకాల వంటకాలతో అందరికి భారీ విందును ఏర్పాటు చేసి పెంపుడు కుక్కపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. ప్రతి ఏడాది మిల్కీ పుట్టినరోజున ఇదే తంతు.. అందర్నీ పిలుచుకొని ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకొని తమ మిల్కీని ఆశీర్వదించాలని కోరడం వీరికి పరిపాటే అయ్యింది. కొంతమందికి ఇది వింతలా అనిపించిన కుక్కలను పెంచుకునే వారికి మాత్రం.. వాటితో ఉండే అనుబంధం ప్రత్యేకమని చెప్పాలి.
Read Also: Rohit Sharma: ఆ ఇద్దరే మలుపు తిప్పారు.. కోహ్లీ అది నిరూపించాడు