‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు.
భూమి మీద దుస్తులు వేసుకోవడం చాలా సులభం. కానీ.. అంతరిక్షంలో దుస్తులు ధరించడం ఒక సవాలు. కానీ అనుభవజ్ఙుడైన నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షంలో సులభంగా దుస్తులు ధరించే పద్ధతిని జనాలకు చూపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ బయటపడింది. ఆయన తన ప్యాంటును చాలా ప్రత్యేకమైన రీతిలో ధరించారు. ఈ వీడియో ఫిబ్రవరి 21న షేర్ చేశారు. వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన డ్రెస్సింగ్ టెక్నిక్‌ను ప్రదర్శించారు. దీనిని చూసి…
బోయింగ్ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సంవత్సరం తిరిగి రాలేరు. ఈ ఏడాది వ్యోమగాములు తిరిగి రావడం సాధ్యం కాదని నాసా శనివారం (ఆగస్టు 24) తెలిపింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్‌యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్‌లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగుర వేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
చంద్రుడితో మానవాళికి ఉన్న అనుబంధ ఎంతో.. చిన్న పిల్లలకు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ.. చందమామ రావే అంటూ పాడటం.. ఇలా చెప్పుకుంటే పోతే.. ప్రతి ఒక్కరి జీవితంలో చందమామతో ప్రత్యేక అనుబంధం ఉండేఉంటుంది. అయితే అలాంటి అలంత దూరంలో ఉన్న చందమామపైకి రాకెట్లను పంపి పరిశోధనలు చేస్తున్నాం. చందమామపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించాం. అయితే చంద్రుడుపై ఏముంది అనే మిలియన్ డాలర్ల ప్రశ్నను ఛేదించేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు నెట్టింట్లో ఓ…
ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. భారత్‌లో ఒకప్పుడు ఊపు ఊపింది ఈ షార్ట్ వీడియో యాప్.. అయితే, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ఆ యాప్‌పై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది.. ఏదేమైనా.. ఎంతోమందిలోని ప్రతిభను బయటకు తీసింది టిక్‌టాక్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లోనూ కాదు.. అంతరిక్షం (స్పేస్ స్టేషన్)లోనూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది టిక్‌టాక్. దీనికి కారణం.. యురేపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్ సమంత…
అంతరిక్షంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఇతర గ్రహాల స్థితిగతులను అంచనా వేసేందుకు స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతరిక్ష కేంద్రంలో సభ్యదేశాలకు చెందిన పరిశోధకులు రోటేషన్ పద్ధతిలో పనిచేస్తుంటారు. వ్యోమగాములు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి మారుతుంటారు. అయితే, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన మనిషి భారరహిత స్థితికి చేరుకుంటారు. Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: మాస్క్ అప్‌గ్రేడ్… ఆ సమయంలో తప్పని సరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అందుకే ప్రతిరోజూ క్రమం…