అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. విదేశాలనుంచి బంగారం, డ్రగ్స్, ఇతర నిషేధిత వస్తువులు తెస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాఆ కోల్ కత్తా లో కోటి రూపాయల విలువ చేసే మూడు అరుదైన విదేశీ కోతులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ కోతులను విదేశాల నుండి అస్సాం మీదుగా బెంగాల్ లోని సిలిగురికి రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.
విశ్వసనీయ సమాచారం మేరకు మైనాగురి జాతీయ రహదారి పై ఓ బస్సు ను అడ్డుకున్నారు కస్టమ్స్ బృందం. బస్సు ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు. బస్సు కింది భాగంలో రహస్యంగా దాచిన మూడు అరుదైన విదేశీ కోతులను గుర్తించారు. కస్టమ్స్ అధికారులను చూసి బస్సు వదిలి పారిపోయాడు బస్సు డ్రైవర్. కోతులను సీజ్ చేసి అటవీశాఖ అధికారులకు అప్పగించారు అధికారులు. వన్యప్రాణుల చట్టం 1972 ఉల్లంఘించి భారత దేశానికి విదేశీ కోతులను తరలిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. కస్టమ్స్ యాక్ట్ 1962, వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
భారీగా గంజాయి సీజ్
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి గుప్పుమంటూనే వుంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (SEB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పెదబయలు మండలం లింగేటి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 2 కోట్ల విలువ చేసే 1800 కిలోల భారీ గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు సెబ్ అధికారులు.
హయత్ నగర్ లో 370 కేజీల గంజాయిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు.తూర్పు గోదావరి నుండి హైదరాబాద్ కు కారులో తరలిస్తున్న ముఠా గుట్టురట్టుచేశారు. శివాజీ చవాన్, శివాజీ అనే ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు…
Asani Cyclone: ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 37 రైళ్లు రద్దు