Earthquake: అసోంతోపాటు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం స్వల్పంగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.…
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
Assam: అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. అస్సాం ప్రభుత్వం శనివారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జీన్స్, లెగ్గింగ్స్ నిషేధిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు. పాఠశాలల్లో టీషర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి ధరించరాదని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు తమ విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని, అందుకని కొత్త డ్రెస్ కోడ్ పాటించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ…
Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు.
Junmoni Rabha: అస్సాంకు చెందిన వివాదాస్పద లేడీ పోలీస్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం తెల్లవారుజామున నాగావ్ జిల్లాలో కంటైనర్ ట్రక్కును ఆమె కారు ఢీకొడడంతో మరనించినట్లు అధికారు తెలిపారు. డేరింగ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ గా ‘‘లేడీ సింగం’’, ‘‘దబాంగ్ పోలీస్’’గా పేరు తెచ్చుకున్న ఆమె తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘనట జరిగింది. కలియాబోర్ సబ్ డివిజన్ పరిధిలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభుగియా గ్రామం వద్ద…
Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
Assam looking to ban polygaymy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, మతమార్పిడులు, బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయన ఇప్పుడు ‘‘బహుభార్యత్వం’’ నిషేధించాని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధించడం విధించడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు.