Assam Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా అసోంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.