జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్‌లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్‌లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన…
ఆసియాకప్ 2025 ఫైనల్స్ లో భారత్ -పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. టైటిల్ పోరులో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించింది. భారత్ విజయంలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం మరువలేనిది. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు. Also Read:Pawan Kalyan :…
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్‌పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో నఖ్వీ స్పందించారు. మోడీపై…
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ 2025లో అద్భుతంగా రాణించింది. సూర్య బ్రిగేడ్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి ట్రోఫీని గెలుచుకుంది. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారతదేశం తన తొమ్మిదవ ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2025 ఆసియా కప్ ముగిసిన తర్వాత , భారత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశం హర్షించే నిర్ణయం తీసుకున్నాడు. 2025…
టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30) మాయ చేయడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ తడబడినా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో భారత్…
Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 ఎలాంటి విద్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయం తర్వాత తన దూకుడు విధానాన్ని అతను సమర్థించుకున్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన అభిషేక్ శర్మ బౌలర్ ఎటువంటి వారైనా తన ఆటతీరులో మార్పు ఉండదని చెప్పాడు. Tollywood: సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు ఇక…
Surya Kumar Yadav: దుబాయ్‌లో ఆసియా కప్ 2025 ను భారత్ కైవసం చేసుకుంది. ఇక టోర్నీని గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించిన సంఘటనపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కష్టపడి విజయం సాధించిందని, అయితే ట్రోఫీని అందుకోలేకపోవడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. అలాగే నాకు తెలిసి ఇలా చేయడం ఇదే మొదటిసారి…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్), శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్…
Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టు తమ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత జరిగిన ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుక అసాధారణ పరిణామాలతో వార్తల్లో నిలిచింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దీంతో ట్రోఫీ లేకుండానే ఛాంపియన్లుగా భారత ఆటగాళ్లు సంబరాలు…