పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో యంగ్ లయన్స్ ఆఫ్ ఇండియా 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ తరఫున అరిజిత్ హుండాల్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు.
IND vs PAK U-19: ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బిసిసిఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఈరోజు (నవంబర్ 30) మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య మరో గొడవ జరగనుంది. అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్‌తో పోటీపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది.…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్ (4 పాయింట్లు) గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ…
T20 Emerging Asia Cup 2024 IND vs PAK: దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మైదానంలో తలపడేందుకు మరోసారి సిద్దమయ్యాయి. ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.…
Asia Cup 2024 India Schedule: అక్టోబర్ 18 నుంచి ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ప్రారంభం కానుంది. ఒమన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన…
IND vs PAK Match on October 19 in Men’s T20 Emerging Asia Cup 2024: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా…
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్లో గెలిచింది భారత్. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Chamari Athapaththu: ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో మలేషియా మహిళల క్రికెట్ జట్టుపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 119 పరుగులు నాట్ అవుట్ తో అద్భుత సెంచరీ సాధించింది. దింతో ఆమె ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమెకి ఇది టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత…