IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ తెలుగబ్బాయే! ఫుల్ డీటెయిల్స్ ఇవే
- మరోసారి తలపడనున్న భారత్-పాకిస్థాన్
- కెప్టెన్‌గా తెలుగబ్బాయి తిలక్ వర్మ
- స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 Emerging Asia Cup 2024 IND vs PAK: దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మైదానంలో తలపడేందుకు మరోసారి సిద్దమయ్యాయి. ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఆసియా కప్ 2024లో భారత జట్టుకు మన తెలుగబ్బాయి తిలక్ వర్మ సారథ్యం వహిస్తున్నాడు. గతేడాది వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన తిలక్.. టీమిండియా తరఫున 4 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఈ టోర్నీలో కెప్టెన్, బ్యాటర్‌గా సక్సెస్ అయి జట్టులో సుస్థిర స్థానం సంపాందించాలని చూస్తున్నాడు. అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, వైభవ్ అరోరా, సాయి కిశోర్ లాంటి ఐపీఎల్ స్టార్స్ జట్టులో ఉన్నారు. అక్టోబర్ 21న యూఏఈ, అక్టోబర్ 23న ఒమన్‌తో మ్యాచులు ఉన్నాయి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక టీమ్స్ ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. సెమీ ఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.
Also Read: IND vs PAK: ఆడండి, వెళ్లండి.. బీసీసీఐకి మరో ఆఫర్ ఇచ్చిన పీసీబీ!
ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చహర్.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!