Chamari Athapaththu: ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో మలేషియా మహిళల క్రికెట్ జట్టుపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 119 పరుగులు నాట్ అవుట్ తో అద్భుత సెంచరీ సాధించింది. దింతో ఆమె ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమెకి ఇది టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో కెప్టెన్ చమరి 119 పరుగులు నాట్ అవుట్ తో 184/4 స్కోర్ చేసింది.
Eating Sprouts: మొలకలను తినడం వెనుక ఉండే రహస్యం ఇదా..?
మ్యాచ్ లో ఓపెనర్ విషమి గుణరత్నే (1) తొందరగానే అవుట్ అయినప్పటికీ అటపట్టు మంచి రన్ రేట్‌తో బ్యాటింగ్ ను కొనసాగించింది. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని క్రీజులో ఉండి కేవలం 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత 63 బంతుల్లోనే తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలిచింది. చివరకు 69 బంతుల్లో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో ఆమెకు 14 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. ఆడపట్టు ఇప్పుడు మహిళల ఆసియా కప్ టి20లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వ్యక్తిగా నిలిచింది. ఈ టోర్నీలో ఆమెకు ముందు అత్యధిక స్కోర్ రికార్డు భారత క్రీడాకారిణి మిథాలీ రాజ్ (97* vs మలేషియా, 2018) పేరిట ఉంది.
ICC World cup Teams: రాబోయే ప్రపంచకప్‌లో మరిన్ని కొత్త జట్లు.. ఐసీసీ కీలక ప్రకటన..
అంతర్జాతీయ టీ20లో అటపట్టుకు ఇదే అత్యధిక స్కోరు. 136 టి20 ఇంటర్నేషనల్స్‌లో 24.44 సగటుతో, 109.74 స్ట్రైక్ రేట్‌తో 3,153 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, ఆమె 3 సెంచరీలు చేయడంతో పాటు, 10 హాఫ్ సెంచరీలు కూడా చేసింది. శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఆమె. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాట్స్‌మెన్లలో ఆమె 7వ స్థానంలో ఉంది. అటపట్టు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు కొట్టింది. దింతో ఆమె ఇప్పుడు ఆసియా కప్ టి20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. వీరి కంటే ముందు భారత్‌కు చెందిన షఫాలీ వర్మ , రిచా ఘోష్, స్మృతి మంధాన , పాకిస్థాన్‌కు చెందిన అలియా రియాజ్‌లు ఒక్కో ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు కొట్టారు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 3 అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడో ఆసియా బ్యాట్స్‌మెన్‌గా అటపట్టు నిలిచింది.
𝐓𝐇𝐄 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 🤩
Chamari Athapaththu records the first hundred in Women's T20 Asia Cup history 🇱🇰💛#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvMALW pic.twitter.com/ZrfPZmZEDX
— AsianCricketCouncil (@ACCMedia1) July 22, 2024