Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు…
Asha Workers: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆశా వర్కర్లు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుండి ‘ఛలో విజయవాడ’కు బయలుదేరారు. ఛలో విజయవాడకు బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లను రైల్వేస్టేషన్‌లో టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు.…
Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ASHA Workers: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రి నారా లోకేష్ ని ఆశ వర్కర్లు కలిశారు. ఈ సందర్భంగా, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలఅంటూ మంత్రికి వినతి పత్రం అందించారు. మూడు సంవత్సరాల కాలం పరిమితి సార్కులర్ రద్దు చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనాలు వ్యక్తిగత అకౌంట్లో వేయాలి అని ఆశా వర్కర్లు కోరారు.
Damodara Raja Narasimha : వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. వారి డిమాండ్లను ఒకొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విపక్షాల కుట్రల్లో ఇరుక్కోవద్దని, వారి ఉచ్చులో పడి భవిష్యత్తు పాడుచేయకూడదని హెచ్చరించారు. ధర్నా చౌక్‌ను మాయం చేసిన వారే ఇప్పుడు ఆశావర్కర్లకు మద్ధతు తెలపడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మంత్రికి సూచన, గత పదేళ్లలో ఈ సమస్యలు పరిష్కరించలేకపోవడం మీద ప్రశ్నించారు. ఆయన, అప్పుడే సమస్యలు…
KTR: ఆశావర్కర్లపై నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Asha Workers: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈనెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని మహిళా అభ్యర్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకుంటే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నియమకాలు చేపట్టనున్నారు.. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆ ఉత్తర్వులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి…