Asha Workers: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నా విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. తమ జీతాలు పెంచాలంటూ ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలంటూ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొద్ది రోజులుగా ఆశ వర్కర్లు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశ వర్కర్లు నినాదాలు చేపట్టారు. మంత్రి గంగుల బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు పోరాడుతాం అంటూ ఆశ వర్కర్లు నినాదాలు చేస్తున్నారు. అయితే గంగుల ఇంటి ముందు గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. గంగుల ఇంట్లోకి చొరబడేందుకు ఆశావర్కర్లు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశావర్కర్లకు వాగ్వాదం చోటుచేసుకుంది.
Read also: Hyderabad Man Kills in London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!
ఎలాంటి షరతులు లేకుండా ఆశా వర్కర్ల డిమాండ్ మేరకు నెలకు రూ.18 వేలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన విషయం తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆశా వర్కర్లు దీక్షలు చేస్తున్నారు. సోమవారం కొండాపూర్, సదాశివపేటల్లోని దీక్షా శిబిరాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఆశా వర్కర్లకు అండగా నిలుస్తామన్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవే. ఆశా వర్కర్లు ఎప్పుడైనా తమ విధులను నిర్వహిస్తారని, రాష్ట్రం కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారు తమ కుటుంబాలకు దూరంగా సేవలందించారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్ ఉండాల్సి ఉండగా కొన్ని చోట్ల రెండు వేల మందికి ఒక్కరే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే ఆశా వర్కర్లకు పనిభారం పెరగడంతోపాటు ఆన్‌లైన్ వర్క్ కూడా పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశా వర్కర్లకు లక్ష్యం మేరకు వేతనాలు ఇస్తున్నారని, లక్ష్యం నెరవేరకపోతే జీతం కూడా తగ్గిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నా వారికి తగిన జీతం, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఆశా వర్కర్లు వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నప్పటికీ వారికి హెల్త్ కార్డులు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఎలాంటి షరతులు లేకుండా నెలకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, వారి కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Ponguleti: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు