ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన…
పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇండస్ట్రీలోకి వాళ్ళే కాదు అభిమానులతో పాటు అందరూ ఆయన ఇక లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో విశాల్ ఒకరు. విశాల్, పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. తాజాగా పునీత్ మృతి గురించి ఎమోషనల్ అయ్యారు విశాల్. అంతేకాదు అయన కోసం ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నారు. Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్…
విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమా దసరా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య విలన్ గా నటించిన ఈ సినిమా ‘టీజర్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ సినిమా కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో…
తమిళ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” చిత్రం. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో విశాల్, ఆర్య , మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 23న ఆర్య…
‘సరపట్టా పరంపరై’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆర్య ఇటీవల ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. శ్రీలంకకు చెందిన మహిళ విద్జా తనను ఆర్య మోసం చేసి 70 లక్షలు దోచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఆర్యను పోలీసులు ప్రశ్నించి నిర్దోషి అని నిర్ధారించారు. చెన్నై పులియంతోప్‌కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను ఆర్యలా నటించి మోసం చేశారని పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు వాట్సప్…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రౌడీ బాయ్స్’ ఇక పర్ ఫెక్ట్…
కోలీవుడ్ స్టార్స్, స్నేహితులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పెప్పీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. “పడదే” అంటూ సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్ సరికొత్త ట్యూన్స్ తో…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
కోలీవుడ్ స్టార్స్, స్నేహితులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఎనిమీ” సెప్టెంబరులో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా టీజర్ ను విడుదల చేసి సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ టీజర్‌లో విశాల్, ఆర్యలు టామ్ అండ్ జెర్రీ ఆటలో పాల్గొన్నారు. Read Also : కామెడీ…
ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో దీని గురించి చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ…