‘సరపట్టా పరంపరై’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆర్య ఇటీవల ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. శ్రీలంకకు చెందిన మహిళ విద్జా తనను ఆర్య మోసం చేసి 70 లక్షలు దోచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఆర్యను పోలీసులు ప్రశ్నించి నిర్దోషి అని నిర్ధారించారు. చెన్నై పులియంతోప్‌కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను ఆర్యలా నటించి మోసం చేశారని పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు వాట్సప్ లో ఆ మహిళతో చేసిన ఛాట్ ను కూడా బయటపెట్టారు.
Read Also : ఖరీదైన లంబోర్ఘినితో ఎన్టీఆర్
ప్రస్తుతం కెరీర్‌లో వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమ దశలో ఉన్న ఆర్యకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ వార్త తెలిసన వెంటనే చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్య ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. నిజమైన నేరస్థుడిని అరెస్ట్ చేసినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు పోలీస్ కమిషనర్-సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చెన్నై సైబర్ క్రైమ్ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన తనను ఎంతగానో గాయపరిచిందని, ఈ విషయంలో తనను నమ్మిక ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఆర్య సుందర్ సి ‘అరణ్మనై 3’ లో నటిస్తున్నాడు. ఇందులో ఆండ్రియా, రాశి ఖన్నా, సాక్షి అగర్వాల్ హీరోయిన్లు. అంతే కాదు విశాల్ ‘ఎనిమీ’లో విలన్ గానూ నటిస్తున్నాడు.
I would like to thank Commissioner of Police @chennaipolice_
— Arya (@arya_offl) August 24, 2021
Additional Commissioner of Police-Central Crime Branch and
Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗