ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి.
సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన “మంచి రోజులొచ్చాయి” సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ ట్రైలర్ నవ్వులు పూయించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ప్రదర్శితం కానున్నాయి.
Read Also : పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రామ్ చరణ్
రజనీకాంత్ చిత్రం “అన్నాత్తే” రేపు “పెద్దన్న”గా తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా కనిపించనుంది. నయనతార, మీనా, ఖుష్బూ వంటి పలువురు ప్రముఖులు కీలకపాత్రల్లో నటించారు.
విశాల్, ఆర్య కలిసి నటించిన “ఎనిమీ” కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్, ఆర్య ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. మొత్తానికి రేపు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ట్రయాంగిల్ పోరు జరగనుంది. మరి దీపావళి విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.