హయత్‌నగర్‌లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో జరిగినట్లు…
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను అణిచివేయడంలో భాగంగా సిట్–సీఐడీ భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి ఎనిమిది మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసింది.
Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్ తన నానమ్మ ఇంటికి, హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ స్థానికంగా ఉండే అదిల్ హుసేన్‌తో పరిచయం ఏర్పడి, నకిలీ నోట్ల…
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో 19 ఏళ్ల బాలికపై 23 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, వారందరినీ రిమాండ్‌కు పంపారు. బుధవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విదుష్ సక్సేనా ఈ మేరకు సమాచారం అందించారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లాల్‌పూర్ పాండేపూర్ ప్రాంతంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు…
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు…
గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం" అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే…
కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.