తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు.