సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... AP PPC అనే కంపెనీ ఏర్పాటు చేసి, ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది.. అలాగే, ఫీడ్ ధరలో 14 రూపాయలు MRP మీద అందరికీ సమానంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ టారిఫ్ తగ్గించడం ద్వారా ఆక్వా రైతులకు భారం తగ్గించాలని నిర్ణయించారు.. స్ధానిక మార్కెట్‌ను పెంచడానికి, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు…
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్తను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి చితకొట్టారు. తీవ్ర గాయాలైన సదరు కార్యకర్త అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో…
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు..
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు చేస్తున్నారు. రెండు రోజులు బట్టి ఎండ తీవ్రత ఉక్కుపోతవలన చాపల చెరువులో డీవో పడిపోయి ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి.
ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు.. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదుల్లో…
ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి ఛార్జీల భారాన్ని తగ్గించాలి. విద్యుత్ ఛార్జీల పెంచి ఆక్వా రంగాన్ని పట్టపగలు ఉరితీశారు. అత్యధిక ఆదాయాన్ని, ఉపాధి కల్పించే ఆక్వారంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు రెట్టింపు చేశారు. ఇప్పటికే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల…