పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా రైతుల పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆక్వా రైతులు మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని సీయం జగన్ హమీలు ఇచ్చారు ..ఒక్క హామీ ఆయన నెరవేర్చలేదన్నారు. సబ్సిడీలు ఎగ్గొట్టడానికి అక్వా జోన్, నాన్ అక్వా జోన్ అంటూ ప్రాంతాలను విభజించారు. సంక్షోభంలో ఉన్న అక్వా రైతులను ఆదుకోవడానికి ఒక్కసారి కూడా సీమం ప్రధానితో మాట్లాడలేదు. అక్వా సాగుకు సంబంధించిన అన్ని రకాల అనుమతుల ఫీజులను దారుణంగా పెంచేసారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్పందించకుంటే, అక్వా రంగం మరింత దిగజారుతుందన్నారు. ఆక్వా రైతుల పోరుబాట కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి సీయం జగన్. దోపిడి, విధ్వంసం, రాచకం ఇదే సీయం జగన్ పరిపాలన అన్నారు. వీటన్నిటిని అమలుచేయడంలో తాడేపల్లి ప్యాలస్ బిజీబిజీగా ఉంటుంది. తాడేపల్లి రాజ ప్రసాదానికి ముడుపులు చెల్లిస్తేనే అక్వా రంగానికి చెందిన ప్లాంట్లు, హేచరీలు నడుస్తాయి.టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆక్వా రంగంపై అవగాహన లేని వ్యక్తి జగన్. ఆక్వారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జగన్ అందుకు సిగ్గుపడాలి. ఆక్వా సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆక్వా ఉత్పత్తులకు అయ్యే ఖర్చుకి అదనంగా 50శాతం MSPగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.. మంచి డిమాండ్ ఇది. ఆక్వా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనాలని కొనుగోలుదారులపై జగన్ ఒత్తిడి తెస్తున్నారు. అది మంచి పద్దతి కాదు. ఆక్వా రైతుల పోరుబాట కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. ఆక్వా రైతుల సమస్యపై పార్టీలకు అతీతంగా అందరూ పోరాడాలి.. అన్ని ప్రభుత్వాలు ఆక్వా రంగానికి సహాయం చేయాలి.. ఆక్వా రైతులకు మంచి చేసేందుకు ఆక్వా రైతుల పోరుబాట లో ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తామన్నారు.
Read Also: Congress: కాంగ్రెస్ పార్టీ “టాస్క్ ఫోర్స్” సమావేశం.. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్
టీడీపీ మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో మొదటగా ఇబ్బందుల్లో పడింది రైతులే అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ మూతపడ్డాయి..నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వ్యవసాయాన్ని, అక్వారంగాన్ని ప్రోత్సాహించారు. హామీలు ఇవ్వడమేగానీ, జగన్ వాటిని అమలు చేయడం లేదు. ఆక్వా రైతుల పోరుబాట కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా రంగం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో వుంది..ఆక్వా రంగంపై అనేక ఆంక్షలు పెట్టడంతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చారని ఆవేదన చెందారు.
ఉండిలో ఉద్రిక్తత
ఆక్వా రైతుల పోరుబాటలో భాగంగా ఉండి విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆక్వా రైతులు.ఉండి విద్యుత్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్వా రైతుల పోరుబాటలో భాగంగా ఉండి విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆక్వా రైతులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు. రోడ్డు పై బైఠాయించి టిడిపి నేతలు,రైతుల నిరసనతో అక్కడ ఉద్రికత ఏర్పడింది.
Read Also: Krishna Health Updates Live: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రెస్ మీట్