ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్తో మీమ్ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే…
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) తన అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నిజాం కాలంలో పురుడు పోసుకున్న ఈ ప్రగతి రథచక్రానికి ఇవాళ్టితో 90 ఏళ్ళు పూర్తయ్యాయి. జూన్ 15, 1932లో ఆర్టీసీ ఏర్పాటయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) టీఎస్ఆర్టీసీ (TSRTC) గా రూపాంతరం చెందింది. ఈ రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా.. ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితం, సుఖవంతం అనే నినాదం వుంది.…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…
వినూత్న ప్రయోగాలతో ప్రయాణికులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ (APSRTC). బస్సుల్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని నిర్ణయించింది ఆర్టీసీ. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని ఆ దిశగా ప్రయోగం మొదలెట్టింది. డిజిటల్ కరెన్సీని విపరీతంగా వాడుతున్న…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం పెను దుమారంగా మారింది. APSRTC ని ప్రైవేట్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలో భాగంగానే అద్దె బస్సుల సంఖ్యని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అనుమానాలు రేకెత్తాయి. అయితే, తాజాగా వీటిని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయే తప్ప, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.…
ఏపీ సీఎం జగన్ ఇక నుంచి జిల్లా పర్యటనలు చేయనున్నారు. సీఎం జగన్ జిల్లా పర్యటనలకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేస్తోంది ప్రభుత్వం. సీఎం పర్యటనల నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేయాల్సిందిగా ఆర్టీసీకి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుచ పాంట్రీ వాహనం కండిషన్ చెక్ చేశారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. గతంలో 2009, 2015 సంవత్సరాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను కొనుగోలు…
ఏపీలో వరుసగా ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే బాదుడే బాదుడు అంటే విపక్షాలు నిరసనలకు దిగాయి. ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు.. ప్రజలను బాదే ప్రభుత్వం అన్నారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు? ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70…
1. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం వరిధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2. ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను పెంచింది. అయితే పెరిగిన బస్సు చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. డీజిల్ సెస్, సెఫ్టీ సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలతో కలిసి కనిష్ఠ ధర రూ.10 పెరిగే అవకాశం ఉంది. 3. నేడు ముంబాయి…