వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ (ఏపీపీఎస్సీ).. 8 పోటీ పరీక్షలకు సంబంధించి.. తేదీలను వెల్లడించారు.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ..
ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది.. పాత షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను http://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది ఏపీపీఎస్సీ..
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను…
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చి 27వ తేదీన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి.. రికార్డు స్థాయిలోనే కేవలం 27 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేయడం విశేషమే. ఇక గ్రూప్ వన్ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొనగా., పరీక్ష రాసిన వాళ్లలో కేవలం 4,496 మందిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించారు అభ్యర్థులు. ఇక…
తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆన్లైన్ వేదికగా ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో నేడు ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు గాను మొత్తం 92,250 మంది అభ్యర్థులను ఎంపిక చేసారు అధికారులు. ఫిబ్రవరి 25 2024న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో…
ఏపీలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభం కాగా.. ఓ వ్యక్తి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అభ్యర్థిని కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు.