గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు..
Group 1 Mains Result Release: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఈ రోజు గ్రూప్ ఫలితాలను విడుదల చేశారు.. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా గౌతం సవాంగ్ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో…
APPSC Group 1 and Group 2: ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది.. ఇప్పటి వరకు గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించారు సంబంధిత అధికారులు.. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. హెచ్‌వోడీలతో…
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇప్పటివరకు గ్రూప్ 2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించేశారు.. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది ప్రభుత్వం.. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ…
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు తేదీని ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)… స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో పేపర్…