ప్రత్యక్ష ఉద్యోగ నియామకల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తోన్న విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది..అభ్యర్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది ఏపీపీఎస్సీ... ఉద్యోగాల ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది..
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (A.P.P.S.C.).. ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ.. అయితే, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం చేపట్టిన ఏపీపీఎస్సీ.. నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. రిజల్ట్స్‌ను APPSC వెబ్‌సైట్‌లో పెట్టింది.
ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు…
Group 1 Mains 2025: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
పీఎస్సార్‌పై మరో కేసు నమోదైంది.. ఏపీపీఎస్సీ గ్రూప్1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు.. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పీఎస్సార్ ఆంజనేయులు పనిచేసిన సమయంలో.. ఈ అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిదంటూ ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో.. పీఎస్సార్ పై 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అయితే, యూనిఫాం సర్వీసెస్ ర్రికూట్‌మెంట్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం.. అదే, నాన్ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల చేసింది. రెండు పేపర్ల 'కీ' లు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459…
మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10…