APPSC Group 2 Results: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 92 వేల మంది మెయిన్స్ కు ఎంపిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆన్లైన్ వేదికగా ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో నేడు ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు గాను మొత్తం 92,250 మంది అభ్యర్థులను ఎంపిక చేసారు అధికారులు. ఫిబ్రవరి 25 2024న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను అధికారులు రిజెక్ట్ చేశారు.
Also Read: Karumuri Nageswara Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో ప్రజలు లేరు..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఫిబ్రవరి 25 2024న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 899 గ్రూప్-2 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, అందులో 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక వీరిలో 4,04,037 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దింతో ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది మాత్రమే హాజరయ్యారని ఏపీపీఎస్సీ ప్రకటన రూపంలో తెలిపింది. రాష్ట్రములోని 24 జిల్లాల్లోని మొత్తం 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.
Also Read:RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!
బుధవారం నాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయగా.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేసింది ఏపీపీఎస్సీ. ఇక ఎంపికైన వారికి జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు కలిసి 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ కి 150 మార్కులు కేటాయించారు. ఈ పేపర్స్ లో పేపర్-1 లో చూస్తే.. ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉండనున్నాయి. అలాగే ఇక పేపర్-2 విషయానికి వస్తే.. భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉండనున్నాయి. ఇందులో ప్రతి ఒక్క సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు అధికారులు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!