ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ…
పోలవరం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి…
ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,27,390 కు చేరింది. ఇందులో 14,24,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,92,104 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 99…
వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారు. అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదు జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలి. అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని పేర్కొన్నారు. కోవిడ్ కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో…
బ్లాక్ ఫంగస్ మందుల పై సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది అని అన్నారు. ఒక్కో రోగికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీకూడా సరిపోని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా…
ప్రైవేటు హాస్పిటళ్ళ దందా పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆరోగ్య శ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణాజిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలి. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మన ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి అన్నారు. ఆరోగ్య మిత్రలు, సీసీ కెమెరాలు…
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో…
యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసారు మంత్రి ఆళ్ల నాని. తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల DMHO లు DCHS, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి…
విశాఖపట్నం హెచ్పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…