టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. “తండ్రి కంటే కొడుకు ఒక ఆకు ఎక్కువే చదివాడని కిరీటం పెట్టించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు మాలోకం. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తే అది తన ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్నాడు. చదువు ‘కొన్న’ వాడికి పరీక్షల విలువ ఏం తెలుస్తుంది? శుద్ధ మొద్దులకే పరీక్షలంటే భయం.” అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.