బ్లాక్ ఫంగస్ కేసుల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో… రాష్ట్రంలో మొత్తం 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన ఇంజెక్షన్లతో కలిపి 3,445 ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. అవసరాల్లో ఇది 10 శాతమే అని తెలిపిన సీఎం వైఎస్ జగన్ కేసుల సంఖ్యను చూస్తే వచ్చే వారం రోజుల్లో కనీసంగా 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు…
వారం రోజుల తర్వాత కృష్ణపట్నం లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు ఆనందయ్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ అనుమతించం లేదు పోలీసులు.. వారం రోజులపాటు కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ లో ఉన్నారు ఆనందయ్య. అయితే పెద్ద ఎత్తున ఆనందయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు గ్రామస్తులు. అయితే నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఇక్కడి నుంచి…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 14,429 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,57,986 కు చేరింది. ఇందులో 14,66,990 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,80,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 103 మంది…
సంగా రెడ్డిలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, త్వరలో మరొక 13 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తల్లితండ్రులు జ్ఞాపకార్థము పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచనతో చేస్తున్నాను. పేద…
ఇరిగేషన్పై సీఎం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో… పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించారు అధికారులు. అలాగే స్పిల్వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయి. జూన్ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని… ఈనెలాఖరు కల్లా స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. ఇక వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆధీశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. అయితే ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్కు లేఖరాశామని,…
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్లో ఉన్నాయన్న సీఎం… పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ఉన్న ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు.…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…
కోట్లాది తెలుగు వారి ఆరాధ్య దైవం , యావత్ ప్రపంచంలోనే మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక ఐకాన్ సీనియర్ ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేశారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని..తెలుగు ప్రజలకు…
ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్…