బ్లాక్ ఫంగస్ కేసుల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో… రాష్ట్రంలో మొత్తం 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన ఇంజెక్షన్లతో కలిపి 3,445 ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. అవసరాల్లో ఇది 10 శాతమే అని తెలిపిన సీఎం వైఎస్ జగన్ కేసుల సంఖ్యను చూస్తే వచ్చే వారం రోజుల్లో కనీసంగా 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు సరిపోవు. ఇంజక్షన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది. అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య పరంగా ఉన్న ప్రత్యామ్నాయాలపై వైద్యులు, అధికారులను ప్రశ్నించారు సీఎం. అయితే బ్లాక్ ఫంగస్ ఉన్న తీవ్రతను బట్టి కొందరికి ఇంజక్షన్లు, మరికొందరు ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు వైద్యధికారులు. బ్లాక్ ఫంగస్‌కు మందులు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడంపై దృష్టి పెట్టాలన్న సీఎం… కంపెనీలతో సమన్వయం చేసుకుని వాటిని తెప్పించుకోవాలన్నారు.