సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల చదువుకు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని లేఖలో కోరారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. చూడాలి మరి దీని పై సీఎం జగన్ స్పందిస్తారా… లేదా అనేది.