ఆస్తి పన్ను పెంపు పై సీపీఐ,సీపీఎం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం లో పాల్గున్న సీపీఐ రామకృష్ణ,సీపీఎం మధు,టీడీపీ గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం మధు మాట్లాడుతూ… సీఎం మూడు రాజధానులు అంటారు, బిజెపి ఒకే రాజధాని అంటుంది. అమరావతి పై బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం తో ప్రకటన చేయించాలి. పన్నుల భారాల అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పాపం పెరిగినట్లు ఆస్తి పన్ను కూడా ప్రతి యేడాది పెరుగుతుంది. విలువ ఆధారిత ఆస్తి పన్ను వెంటనే రద్దు చేయాలి . రైతుల శ్రేయస్సు మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదు. కరోనా కష్ట కాలంలో ప్రజల పై భారాలు మోపడం సిగ్గు చేటు అన్నారు.
సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ… ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోము. పన్నుల పెంపు విధానం ప్రజలకు అదనపు భారంగా మారనుంది. మున్సిపల్ ఎలక్షన్ సమయంలో పన్నులు పెంచబోమనిచెప్పి…ఎన్నికలు ముగిశాక పన్నులు పెంచడం ఎంత వరకు సబబు. జగన్ పాలనంతా మోసపురితంగా మారింది. మాట తప్పడం… మడమ తిప్పడం జగన్ సర్కార్ కే సొంతం అని తెలిపారు.