ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపాల్ కార్పరేషన్ టాక్స్ పెంచడం దురదృష్టకరం అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఐఎఎస్,ఐపిఎస్ లు ఇతర ఉన్నధికారులు టాక్స్ కట్టనవసం లేదు. ప్రజలు కట్టిన టాక్స్ తో వారు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుకే టాక్స్ లు పెంచాలంటు అధికారులు సలహలు ఇస్తున్నారు. ఈ జీవోని తక్షణమే రద్దు చేయ్యాలి అన్నారు. గుజరాత్ టాక్స్ లను వేరు చేసింది ప్రజలపై భారాన్ని మోపలేదు. జీవో రద్దు చేయ్యకుంటే రాష్ట్రమంత నిరసనలు చేపడతం. ఏపీలో ప్రజాస్వామ్యన్ని కూని చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము సొత్తు దోపిడి చేస్తున్నారు. రేపు కెజిహెచ్ ను సైతం అమ్మేస్తారు. ప్రభుత్వ ఆస్తుల అయ్యాక ప్రైవేటు ఆస్తులు అమ్ముతారు. కలెక్టర్ ఆఫీసును సైతం తనఖ పెట్టడం అవివేకమైన చర్య అని తెలిపారు. ముఖ్యమంత్రి మరో సారి ఈ నిర్ణయం పై పునరాలోచన చేయ్యాలి అని పేర్కొన్నారు.