మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన చేసిన దొంగ అశోక్ గజపతిరాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అశోక్ గజపతిరాజు గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉంది. కాబట్టి ఆయన జైలుకి వెళ్లడం తప్పదు. మాన్సస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తాము. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజుల ఫీలవుతున్నారు.. సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించ వద్దని గతంలో తీర్పు నిచ్చింది. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రవేశం పై లింగ వివక్ష పాటించ వద్దని సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు.
Read Also : ఏపీలో రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది…
కానీ అశోక్ గజపతిరాజు మహిళలపై లింగ వివక్ష చూపిస్తున్నారు. పురుషులతో పాటు మహిళలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమానంగా గౌరవిస్తారు. భూకబ్జా వ్యవహారాల్లో టిడిపి నేతలు తాత్కాలికంగా కోర్టులు నుంచి స్టే తెచ్చుకోగలరు. కానీ చేసిన తప్పుకు శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారినుంచి వదిలిపెట్టేది లేదు. కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొనమని చెప్పవు అని పేర్కొన్నారు.