జగన్ చెడ్డీ గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అని అన్నారు టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కేంద్రంగా రెండు వేల 500 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని అన్నారు. దానికి సిబిఐ దర్యాప్తు అవసరం. పర్యావరణ హితం కాకుండా, మైనింగ్ పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఎస్ఇబి దాడులు ఏవి ప్రశ్నించారు. ఇసుకకు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి వైసిపి దోపిడీ చేస్తుంది అని పేర్కొన్నారు.